మరో బాహుబలి మోటార్ వెట్‌రన్ సక్సెస్

రామడుగు (చొప్పదండి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీపూర్ పంపుహౌస్ (గాయత్రి)లో నీటి పారుదల శాఖ అధికారులు సోమవారం రాత్రి 9.15 గంటలకు 4వ బాహుబలి విద్యుత్ మోటార్ వెట్‌రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం అధికారులు ఇక్కడ 5వ బాహుబలి మోటార్‌కు విజయవంతంగా వెట్‌రన్ నిర్వహించిన విషయం తెలిసిందే.
సోమవారం మధ్యాహ్నం 4వ మోటార్ వెట్‌రన్‌కు ఏర్పాట్లు చేసుకున్న అధికారులు కొన్ని సాంకేతిక సమస్యలు రావడంతో వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించారు. అనంతరం రాత్రి వెట్‌రన్ నిర్వహించారు. రాష్ట్ర సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి స్విచ్‌ఆన్ చేసి మోటార్‌ను ప్రారంభించారు. ఈ వెట్‌రన్ కార్యక్రమంలో ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్, డీఈఈ గోపాలకృష్ణ, ఏఈఈలు సురేశ్, రమేశ్, శ్రీనివాస్ ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. దాదాపు గంటపాటు ఈ వెట్‌రన్‌ను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి