రాష్ట్ర బార్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా అనంత్‌రెడ్డి | Ananth reddy as State Bar Federation | Sakshi
Sakshi News home page

రాష్ట్ర బార్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా అనంత్‌రెడ్డి

Aug 26 2018 4:14 AM | Updated on Aug 26 2018 4:14 AM

Ananth reddy as State Bar Federation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్‌ అసోసియేషన్‌కు శనివారం నూతన కార్యవర్గం ఏర్పాటైంది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ క్రిమినల్‌ కోర్టు ఆవరణలో జరిగిన సమావేశంలో ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా మహబూబ్‌నగర్‌ జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అనంత్‌రెడ్డిని ఎంపిక చేసుకున్నారు.

వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నాంపల్లి మెట్రోపాలిటన్‌ క్రిమినల్‌ కోర్టుల బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.బాలరాజ్, ప్రధాన కార్యదర్శిగా రంగారెడ్డి జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జి.చంద్రశేఖర్‌రెడ్డి, కార్యదర్శిగా హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు అధ్యక్షుడు డి.జగదీశ్వర్‌రావు ఎంపికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా కేఎస్‌ రాహుల్, బి.జానకి రాములు, జి.విప్లవ్‌రెడ్డి, జి.వినోద్‌కుమార్, కె.శ్రీనివాస్‌రెడ్డి, కె.శేఖర్‌రెడ్డి, బి.యోగేశ్వర్‌రావు, బ్రహ్మయ్య, వి.శ్రీరామ్‌ కుమార్, ఎన్‌.కృష్ణ, జగన్‌మోహన్‌ గౌడ్, హెచ్‌.చక్రధర్‌ ఎంపికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement