
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోలో లోపాలు మరోసారి బయటపడ్డాయి. అమీర్‌పేట నుంచి రాయదుర్గం మార్గంలో తొమ్మిది మెట్రో ట్రైన్‌లు పట్టాలపైనే నిలిచిపోయాయి. సాంకేతిక లోపంతోనే మెట్రో సేవలకు అంతరాయం కలిగినట్టు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అయితే, లోపాన్ని సరిచేయడంతో రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.