ఏఎమ్‌డీ నూతన డైరెక్టర్‌గా ఎమ్‌.బి.వర్మ

AMD New Director MB Varma - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏఎమ్‌డీ(అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ రిసెర్చ్‌) సంస్థకు నూతన డైరెక్టర్‌గా సైంటిఫిక్‌ ఆఫీసర్‌ ఎమ్‌.బి.వర్మ మంగళవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఏఎమ్‌డీ సంస్థ డీఏఈ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ) పరిధిలో పని చేస్తుంది. గతంలో ఎమ్‌.బి. వర్మ ఇదే సంస్థలో అడిషనల్‌ డైరెక్టర్‌గా పని చేశారు. వర్మ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ హెచ్‌ ఫ్లస్‌ హోదాలో ఉన్నారు. ఆయన ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘడ్‌ ముస్లిమ్‌ యూనివర్సిటీ నుంచి భూవిజ్ఞాన శాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీని, ఎమ్‌.ఫిల్‌ డిగ్రీని పొందారు.

1982లో ఏఎమ్‌డీలో చేరారు. అటామిక్‌ మినరల్స్‌ అన్వేషణలో వర్మకు విశేష అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని తుమ్మల పల్లి, కొప్పునూరు, తెలంగాణలోని పెద్దగట్టు, చిట్యాల్‌లో యూనిరేయం వనరులను వృద్థి చేయడంలో వర్మ కీలక పాత్ర పోషించారు. జార్ఖండ్‌ రాష్ట్రంలో యూనేరియం నిక్షేపాలు వెలికితీయడంలో కూడా వర్మ విశేష కృషి చేశారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల యూరేనియం వనరుల కోసం చేసిన కృషికిగాను ఆయనకు భారత గనుల మంత్రిత్వ శాఖ అందించే భూ విజ్ఞాన శాస్త్ర పురస్కారం లభించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top