ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

All Arrangements Completed  For MlC Elections - Sakshi

సూర్యాపేట రూరల్‌ : సూర్యాపేట నియోజకవర్గంలో శుక్రవారం నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో భాగంగా సిబ్బందికి గురువారం సూర్యాపేట మండల పరిషత్‌ కార్యాలయంలో ఆర్డీఓ మోహన్‌రావు ఆధ్వర్యంలో ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. సూర్యాపేట రెవిన్యూ డివిజన్‌ పరిధిలోని నాగారం మండలం మినహా మిగతా 13 మండలాలకు కేటాయించిన ఎన్నికల సిబ్బందికి ఈ సామగ్రిని అందజేశారు.

ఒక్కో మండలానికి ఒక ప్రిసైడింగ్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్, ఓపీఓ, వెబ్‌కాస్టింగ్, వీడియో గ్రాఫర్, మైక్రో అబ్జర్వర్‌ చొప్పున సిబ్బందిని కేటాయించామని, సూర్యాపేట ఏవీఎం పాఠశాలలో అదనపు సిబ్బందిని నియమించామని ఆర్డీఓ వెల్లడించారు. 13 మండలాలకు 80 మంది సిబ్బందిని నియమించామన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట ఆర్డీఓ మోహ న్‌రావు, ఏఓ శ్రీలత, డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐ వెంకటేశ్వరరెడ్డి, సూర్యాపేట తహసీల్దార్‌ సుదర్శన్‌రెడ్డి, ఎలక్షన్‌ తహసీల్దార్‌ రాంరెడ్డి పాల్గొన్నారు.

ఎన్నికల సామగ్రి పంపిణీ పరిశీలన 
సూర్యాపేట మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఎన్నికల సామగ్రి పంపిణీని కలెక్టర్‌ అమయ్‌కుమార్, ఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పకడ్బందీగా బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ పోలీసులను ఆదేశించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top