ఎన్నికల సమయంలో రైతులకు టీఆర్‌ఎస్ ఇచ్చిన వాగ్దానాల మేరకు రుణాల మాఫీపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయాలని టీ-బీజేపీ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్: ఎన్నికల సమయంలో రైతులకు టీఆర్‌ఎస్ ఇచ్చిన వాగ్దానాల మేరకు రుణాల మాఫీపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయాలని టీ-బీజేపీ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. నగరంలోని పార్టీ రాష్ర్ట కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణ మాఫీని ఒక్క ఏడాదికే పరిమితం చేస్తామని కేసీఆర్ ప్రకటిస్తే తాము అసెంబ్లీలోనే కాకుండా తెలంగాణ నలుమూలలా ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు.