
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు కార్పొరేట్ విద్యాసంస్థల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా సోమవారం ఏబీవీపీ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. విద్యార్ధుల ఆత్మహత్యలపై రాష్ట్రం మొద్దునిద్ర పోతోందని విద్యార్ధి సంఘాల నాయకులు మండిపడ్డారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులు పిట్టల్లా రాలుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని విమర్శించారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మూడున్నర ఏళ్లలో వందలాది మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారని తెలంగాణ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్పొరేట్లకు తొత్తుల్లా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.