కలుషిత నీరు తాగి వ్యక్తి మృతి | A person killed by drinking polluted water | Sakshi
Sakshi News home page

కలుషిత నీరు తాగి వ్యక్తి మృతి

Jan 26 2015 4:34 PM | Updated on Sep 2 2017 8:18 PM

గద్వాల పట్టణంలో కలుషిత నీరు తాగి చాంద్ పాషా(55) అనే వ్యక్తి మృతి చెందాడు

మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల పట్టణంలో కలుషిత నీరు తాగి చాంద్ పాషా(55) అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన సలామియా, రిహాన్‌లను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అన్వర్, షరీఫ్, గౌస్ మొయినుద్దీన్‌లను గద్వాల ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. ఇంటిముందున్న పైప్‌లైన్ లీకేజ్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. బాధితులను స్థానిక ఎమ్మెల్యే డీకే అరుణ పరామర్శించారు. కారణాలను అడిగి తెలుసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement