డెంగీతో నవ వధువు మృతి | bride killed with dengue | Sakshi
Sakshi News home page

Sep 26 2017 2:50 AM | Updated on Sep 26 2017 2:50 AM

bride killed with dengue

కాళేశ్వరం(మంథని): డెంగీతో ఓ నవ వధువు మృతి చెందింది. జయశంకర్‌ జిల్లా మహదేవ పూర్‌ మండలం పలుగులకి చెందిన ఉమ (19)కు 4 నెలల క్రితం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం నారాయణపూర్‌కు చెందిన నిట్టూరి ప్రదీప్‌తో వివాహమైంది. వారం రోజులుగా తీవ్ర జ్వరంతో చెన్నూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందింది. డెంగీగా గుర్తించిన వైద్యులు మందులిచ్చారు. సోమవారం ఉదయం మళ్లీ జ్వరం తీవ్రత పెరగడంతో కరీంనగర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement