గోడకూలి 9 మందికి తీవ్రగాయాలు | 9 injured in house wall collapse in chandrayana gutta | Sakshi
Sakshi News home page

గోడకూలి 9 మందికి తీవ్రగాయాలు

Apr 10 2015 6:51 PM | Updated on Sep 3 2017 12:07 AM

నగరంలో శుక్రవారం కురిసిన వర్షానికి ఓ ఇంటి గోడకూలి 9 మందికి గాయాలయ్యాయి.

హైదరాబాద్ : నగరంలో శుక్రవారం కురిసిన వర్షానికి ఓ ఇంటి గోడకూలి 9 మందికి గాయాలయ్యాయి.  ఈ సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబానగర్‌లో చోటు చేసుకుంది. హఫీజ్‌బాబానగర్ బీబ్లాక్‌లో ఉండే మోహినుద్దీన్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని ఇంటికి శుక్రవారం దుబాయి నుంచి బంధువులు వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి పక్కనే నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల ఇంటి గోడ నానింది. మోహినుద్దీన్ ఇంటిపై ఆ గోడ కూలి పడటంతో ఇంట్లో ఉన్న మొత్తం 9 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. చుట్టుపక్కల వారు శిథిలాల నుంచి వారిని బయటకు తీసి, అపోలో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement