సీ–కేటగిరీలో 120 ఎంబీబీఎస్‌ సీట్ల మిగులు | 120 MBBS seat surplus in c- category | Sakshi
Sakshi News home page

సీ–కేటగిరీలో 120 ఎంబీబీఎస్‌ సీట్ల మిగులు

Jul 21 2018 1:41 AM | Updated on Jul 21 2018 1:41 AM

120 MBBS seat surplus in c- category - Sakshi

హైదరాబాద్‌: ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లోని బీ, సీ కేటగిరీలకు జరిగిన మొదటి విడత ఎంబీబీఎస్, బీడీఎస్‌ కౌన్సెలింగ్‌లో బీ–కేటగిరీలో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. సీ–కేటగిరీలో 319 ఎంబీబీఎస్‌ సీట్లకు 199 భర్తీ కాగా 120 సీట్లు మిగిలినట్లు అధికారులు తెలిపారు.

సీ–కేటగిరీలో 150 బీడీఎస్‌ సీట్లకు 48 భర్తీ కాగా 102 సీట్లు మిగిలినట్లు పేర్కొన్నారు. సీట్లు సాధించిన విద్యార్థులు ఈనెల 26 వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాలని, లేదంటే సీటు రద్దవుతుందన్నారు. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. పూర్తి వివరాలు హెల్త్‌ వర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement