12 పోస్టులు.. రూ.16లక్షలు! | 12 posts .. Rs 16 lakhs in ses! | Sakshi
Sakshi News home page

12 పోస్టులు.. రూ.16లక్షలు!

Jun 22 2016 1:32 AM | Updated on Sep 4 2017 3:02 AM

12 పోస్టులు.. రూ.16లక్షలు!

12 పోస్టులు.. రూ.16లక్షలు!

సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)లో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు రంగం సిద్ధమైంది....

సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)లో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. 12 మంది సిబ్బందిని రెగ్యులర్ చేసేందుకు ‘లక్ష’ణంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. వారి వద్ద రూ.16లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఆ మొత్తాన్ని ఓ ‘సెస్’ ఉద్యోగి వసూలుచేసి పనికాగానే పంపిణీ చేసేందుకు సిద్ధంచేశారు. సహకార రంగంలో ఉత్తమ సేవలందించే విద్యుత్ సంస్థలో కాసుల వసూళ్ల పర్వం సంస్థ ప్రతిష్టను దిగజార్చుతోంది.              -సిరిసిల్ల
 
సెస్‌లో కాంట్రాక్టు ఉద్యోగుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్   
రూ.16 లక్షలు వసూలు
సిబ్బందే మధ్యవర్తులు   
12 మందికి ఉద్యోగాలిచ్చేందుకు ఫైల్ సిద్ధం
యూనియన్లతో అంగీకారపత్రాలకు ఒత్తిళ్లు


ఏం జరుగుతోంది ..?
సిరిసిల్ల ‘సెస్’లో ఆరుగురు కంప్యూటర్ ఆపరేటర్లు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.10,500 చొప్పున వేతనమిస్తున్నారు. వీరితోపాటు మరో ఐదుగురు డ్రైవర్లు, ఇద్దరు వాచ్‌మెన్లు కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు. ఆరుగురు కంప్యూటర్ ఆపరేటర్లతో ఒక్కరికి డిగ్రీ లేని కారణంగా అర్హత పొందలేకపోయారు. మరో ఐదురుగు కంప్యూటర్ ఆపరేటర్లు, ఐదుగురు డ్రైవర్లు, ఇద్దరు వాచ్‌మెన్లను పర్మినెంట్ చేసేందుకు ఫైల్‌సిద్ధంచేశారు. తమను పర్మినెంట్ చేయాలని ఇప్పటికే డ్రైవర్లు కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు పన్నెండు మందిని పర్మినెంట్ చేసేందుకు రూ.16లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఎనిమిదిమంది వద్ద రూ.రెండు లక్షల చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది.
 
తెర వెనుక అసలు కథ..
రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయమని జీవో ఇచ్చింది. అరుుతే సహకార సంస్థ ‘సెస్’కు ఆ జీవో వర్తించదని ‘సెస్’ వర్గాలు పేర్కొంటున్నాయి. 1995 బైలా ప్రకారం ఉద్యోగుల నియామకాలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అరుుతే ఈ 12 మందిని నియమించుకునేందుకు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఎన్‌పీడీసీఎల్ రూల్స్ ప్రకారం నియూమకాలు చేయాలన్నా.. అక్కడ ఇంకా కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరేషన్ జరగడం లేదు.

మరోవైపు ‘సెస్’ లో పనిచేసే ఉద్యోగులు కాసులు వసూలుచేసి పాలకవర్గాన్ని తప్పుదోవ పట్టించి ఫైల్‌ను నడుపుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ‘సెస్’ పాలకవర్గం సై తం తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా వేచిచూసే ధోరణితో వ్యవహరిస్తోంది. పన్నెండు నియమకానికి సంబంధించిన ‘సెస్’ పనిచేసే ఉద్యోగుల సంఘాల తో ముఖ్య అధికారులు చర్చించినట్లు సమాచారం. యూనియన్ నాయకులతో ఈ నియూమకాలపై తమ కు అభ్యంతరం లేదని రాత పూర్వకంగా రాయించుకు నే ప్రయత్నంచేశారు. ఎంప్లాయూస్ యూనియన్ నా యకులు దీనికి నిరాకరించారు. మొత్తం వ్యవహా రంలో ‘లక్ష’ణంగా పని కానిచ్చేందుకు ‘సెస్’ ఉద్యోగు లే ఉత్సాహం చూపుతున్నట్లు సమాచారం. రూల్‌ప్రకా రం ఉద్యోగ నియూమకాలు చేస్తున్నప్పుడు ఈ డబ్బు వసూళ్లు ఏంటని ‘సెస్’లోని మరో వర్గం వాదిస్తోంది.
 
నిబంధనల ప్రకారం వ్యవహరిస్తాం
కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే ఫైల్ నిబంధనల ప్రకారం సర్క్యులేట్ అవుతుంది. ‘సెస్’ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తాం. ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని జీవో ఇచ్చింది. దానిప్రకారం అర్హతలను పరిశీలిస్తున్నాం. డబ్బుల వసూలు వ్యవహారం నాకు తెలియదు. ఎవరైనా ఫిర్యాదుచేస్తే చర్య తీసుకుంటాం.
- కె.నాంపల్లిగుట్ట,‘సెస్’ ఎండీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement