చెరకు రసం యంత్రంలో చిక్కుకున్న చెయ్యి

Worker Hand Stuck in Sugarcane Machine in Karnataka - Sakshi

తెగిన వేళ్లు

కర్ణాటక, దొడ్డబళ్లాపురం: ప్రమాదవశాత్తు కార్మికుడి చెయ్యి చెరకు రసం తీసే యంత్రంలో చిక్కుకుని చేతి వేళ్లు తెగిపోయిన సంఘటన మాగడి పట్టణంలో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన యూసుఫ్‌ (28) చేతి వేళ్లు పోగొట్టుకున్న కార్మికుడు. పట్టణ పరిధిలోని తిరుమల రోడ్డులో యూసుఫ్‌ చెరకు రసం యంత్రం బండి పెట్టుకుని వ్యాపారం చేస్తుంటాడు. శుక్రవారం యూసుఫ్‌ యంత్రంలోకి చెరుకు గడలు తోసే క్రమంలో చెయ్యి ఇరుక్కుంది. యూసుఫ్‌ కేకలు విన్న స్థానికులు గ్యాస్‌ కట్టర్‌ సాయంతో రెండు గంటలపాటు శ్రమించి చెయ్యి విడిపించారు. అయితే యూసుఫ్‌ చేతి వేళ్లు నాలుగు తెగిపోయాయి. యూసుఫ్‌ రెండు గంటలపాటు బాధతో కేకలు పెండుతూ నరకం చూశాడు. అప్పటికే పోలీసులు అక్కడకు వచ్చి అంబులెన్స్‌ సిద్ధం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినప్పటికీ తీవ్ర రక్తస్రావం జరగడంతో ప్రథమ చికిత్స అనంతరం బెంగళూరు విక్టోరియాకు తరలించారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top