అనాథ శిశువుకు అమ్మయింది

Woman Constable Breast Feed to Orphan Baby in Karnataka - Sakshi

స్తన్యమిచ్చి ఆదుకున్న మహిళా కానిస్టేబుల్‌  

తల్లిప్రేమకు అర్థం చెప్పిన వైనం

కర్ణాటక, శివాజీనగర: మహిళా పోలీసు కానిస్టేబుల్‌ తల్లి మనసు అందరి ప్రశంసలను అందుకుంటోంది. రోడ్డు పక్కను విసరివేసిన నవజాత శిశువుకి ఆమె స్తన్యమిచ్చి ఆదుకున్నారు. బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు యలహంక జీకేవీకే క్యాంపస్‌ రోడ్డు పక్కలో నవజాత ఆడశిశువును వదిలివెళ్లారు. విపరీతమైన చలికి బిడ్డ గుక్కపట్టి  ఏడుస్తోంది. చీమలు పట్టిన్న నవజాత శిశువును చూసిన కొందరు స్థానికులు విద్యారణ్యపురం పోలీసులకు సమాచారం అందించారు. బిడ్డ లభించిన స్థలం తమ పరిధి కాదని విద్యారణ్యపుర పోలీసులు రాలేదు. దీంతో యలహంక పోలీసులు వెళ్లారు.  

చలించిన సంగీత   
వారిలోని మహిళా కానిస్టేబుల్‌ సంగీతా ఎస్‌ హలిమనికి ఆ బిడ్డను చూడగానే తల్లి మనసు తల్లడిల్లింది. పసిగుడ్డుకు రొమ్ము ఇచ్చి ఆకలి తీర్చారు. బిడ్డకు బట్టలు తొడిగి యలహంక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి, అక్కడ నుంచి వాణి విలాస్‌ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యంగా ఉన్న బిడ్డను పిల్లల సంక్షేమ శాఖకు అప్పగించేందుకు వైద్యులు నిర్ధారించారు. సంగీత చేసిన మంచిపనికి డీసీపీ కళా కృష్ణస్వామితో పాటు పలువురు సీనియర్‌ అధికారులు అభినందించారు. సకాలంలో పాలు త్రాగించి బిడ్డను కాపాడిన సంగీతను ఆసుపత్రి సిబ్బంది ప్రశంసించారు. సంగీతకు 10 నెలల ఆడకూతురు ఉంది. ఆమె గొప్పమనసుపై సోషల్‌ మీడియాలో కూడా మన్ననలు అందుకుంటోంది. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top