వేశ్యావృత్తిని చట్టబద్ధం చేయండి | To legalize prostitution | Sakshi
Sakshi News home page

వేశ్యావృత్తిని చట్టబద్ధం చేయండి

Sep 1 2014 3:01 AM | Updated on Sep 2 2017 12:41 PM

వేశ్యావృత్తిని చట్టబద్ధం చేయండి

వేశ్యావృత్తిని చట్టబద్ధం చేయండి

వేశ్యావృత్తిని చట్టబద్ధం చేయడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలు తగ్గిపోతాయని ప్రభుత్వానికి ప్రముఖ సాహితీ వేత్త నిసార్ అహమ్మద్ సూచన చేశారు.

సాక్షి, బెంగళూరు :వేశ్యావృత్తిని చట్టబద్ధం చేయడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలు తగ్గిపోతాయని ప్రభుత్వానికి ప్రముఖ సాహితీ వేత్త నిసార్ అహమ్మద్ సూచన చేశారు. వేశ్యా వృత్తి ఇతివృత్తంగా ఫొటో గ్రాఫర్ సుధీర్‌శెట్టి స్థానిక చిత్రకళాపరిషత్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలు రూపొందిస్తున్నట్లు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు విధిలేని పరిస్థితుల్లో వేశ్యా వృత్తిని చేపట్టిన వారిపట్ల వివక్ష చూపుతున్నాయని విమర్శించారు. చట్టబద్ధత కల్పించడం వల్ల ఈ వృత్తిలో ఉన్న వారికి తరుచుగా ఆరోగ్య పరీక్షలు చేయాల్సి ఉంటుందని, దీని వల్ల అనేక సంక్రమిక రోగాలను ముందుగానే అరికట్టేందుకు వీలవుతుందని చెప్పారు.

కాగా, ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సమాచారశాఖ మంత్రి రోషన్‌బేగ్ ఈ విషయంపై స్పందిస్తూ... సింగపూర్ వంటి దేశాల్లో వేశ్యా వృత్తికి చట్టబద్దత ఉందన్నారు. అయితే ఇలాంటి చట్టాలను ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement