మూడేళ్లుగా యువతిపై దారుణం | Three booked for gangape of woman | Sakshi
Sakshi News home page

మూడేళ్లుగా యువతిపై దారుణం

Jan 8 2017 3:59 PM | Updated on Sep 5 2017 12:45 AM

మూడేళ్లుగా యువతిపై దారుణం

మూడేళ్లుగా యువతిపై దారుణం

మహారాష్ట్రలోని థానె జిల్లాలో ఓ యువతిపై ముగ్గురు దుండగులు మూడేళ్లుగా సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.

థానె: మహారాష్ట్రలోని థానె జిల్లాలో ఓ యువతిపై ముగ్గురు దుండగులు మూడేళ్లుగా సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

భయందర్‌ టౌన్‌షిప్‌కు చెందిన బాధితురాలితో నిందితులు స్నేహంగా ఉండేవారు. 2013 ఏప్రిల్‌లో ఓ సందర్భంలో నిందితులు మత్తు పదార్థాలు కలిపిన డ్రింక్‌ను ఆమెతో తాగించారు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లాక నిందితుల్లో ఒకడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత నిందితులు ఆమెను మరో ప్రాంతాన్ని తీసుకెళ్లి ఓ గదిలో బంధించి దారుణానికి పాల్పడ్డారు. అప్పటి నుంచి గతేడాది డిసెంబర్‌ వరకు పలుమార్లు ఆమెపై సామూహిక లైంగికదాడి చేశారు. కొన్ని రోజుల క్రితం ముంబైలోని పొవాయ్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని, థానె జిల్లాలోని వర్తక్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. కాగా పోలీసులు నిందితులను ఇంకా అరెస్ట్‌ చేయలేదు.

Advertisement
Advertisement