రాష్ట్రంలో మత ఘర్షణలు రేపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ ఆరోపించారు.
బెంగళూరు: రాష్ట్రంలో మత ఘర్షణలు రేపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ ఆరోపించారు. తీర్థహళ్లిలో విద్యార్థి నందితా మృతిని ఇందుకు పావుగా వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ...తీర్థహళ్లి విద్యార్థిని నందితా మృతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, అయినా కూడా ఈ అంశంలో బీజేపీ అనవసర రాద్ధాంతానికి దిగుతోందని విమర్శించారు. ఇక తమ ప్రభుత్వంలోని మంత్రులు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఈ సందర్భంగా కిమ్మనె రత్నాకర్ పునరుద్ఘాటించారు.