బళ్లారి నగర శివార్లలోని బెళగల్లు రోడ్డు గౌతమ్‌నగర్ నగర్ కాలనీలోని వేశ్యావాటికలపై మంగళవారం పోలీసులు దాడి చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.
వ్యభిచార గృహాలపై పోలీసులు దాడి
Sep 18 2013 3:24 AM | Updated on Sep 17 2018 6:26 PM
	సాక్షి, బళ్లారి : బళ్లారి నగర శివార్లలోని బెళగల్లు రోడ్డు గౌతమ్‌నగర్ నగర్ కాలనీలోని వేశ్యావాటికలపై మంగళవారం పోలీసులు దాడి చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. నగరంలోని డీసీ నగర్‌లోని గౌతమ్‌నగర్ కాలనీ వ్యభిచార కేంద్రాలపై దాడులు చేసి.. మహాబూబ్ ఆలీ, గుద్దప్ప, నారాయణ, దుర్గా, సయ్యద్‌షేక్, రిమాంమాటోలా అనే ఆరుగురు విటులు ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. వీరు కలకత్తా, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చి ఇక్కడ పడుపు వృత్తిని కొనసాగిస్తున్నారు. నగరంలోని వేశ్యా గృహాలకు అమ్మాయిలను అమ్మేందుకు వచ్చారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఇటీవల బళ్లారిలోని డీసీ నగర్‌లో 40 మంది యువతులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 
	 
					
					
					
					
						
					          			
						
				
	 స్థానిక పోలీసులు తూతూమంత్రంగా దాడులు చేస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకుని వచ్చి ఇక్కడ వ్యభిచారం చేయిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా కొందరు బ్రోకర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
