
ముగ్గుర్ని మోసగించి వివాహమాడిన పోలీసు
ముగ్గురు మహిళలను మోసగించి వివాహమాడిన చెన్నై పోలీసు కానిస్టేబుల్‌పై అధికారులు చర్యలు తీసునున్నారు.
టీనగర్: ముగ్గురు మహిళలను మోసగించి వివాహమాడిన చెన్నై పోలీసు కానిస్టేబుల్‌పై అధికారులు చర్యలు తీసునున్నారు. చెన్నై సాయుధ పోలీసు దళంలో పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు అరుణన్. ఇతని సొంతవూరు అరంతాంగి. ఇతనికి అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం జరిగింది. తర్వాత ఆరుణన్ మధురైలో పనిచేస్తూ వచ్చారు. ఆ సమయంలో తిరుప్పరంకుండ్రంకు చెందిన పోలీసు హెడ్ కానిస్టేబుల్ కాళియమ్మాల్‌తో పరిచయం ఏర్పడింది. ఆమెను వివాహమాడేందుకు అరుణన్ ఇష్టపడ్డారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వనున్నానని, అందుకోసం దరఖాస్తు చేసుకున్నట్లు అరుణన్ తెలిపారు.
దీన్ని నమ్మిన కాళియమ్మాల్ అతన్ని వివాహమాడేందుకు సమ్మతిం చింది. కాళియమ్మాల్ పేరును జననిగా మార్చి ఆమెను అరుణన్ వివాహం చేసుకుని విడిగా కాపురం పెటారు. ఆ తర్వాత అరుణన్ చెన్నైకు బదిలీ అయ్యారు. ఆ సమయంలో విదేశాలకు అభ్యర్థులను పంపే సంస్థలో పనిచేస్తున్న కవిత అనే మహిళతో అరుణన్‌కు పరిచయం ఏర్పడింది. కవితకు ఇదివరకే వివాహమై భర్తతో విడిపోయింది. ఆమె కోట్టూర్‌పురంలో విడిగా జీవిస్తోంది.
తనకు భార్య లేదని చెప్పి కవితను అరుణన్ మూడవ వివాహం చేసుకున్నారు. ఇలావుండగా అరుణన్ ముగ్గురిని వివాహమాడినట్లు కళియమ్మాల్‌కు, కవితకు తెలిసింది. దీని గురించి కవిత మైలాపూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదేవిధంగా కాళియమ్మాల్ కూడా ఫిర్యాదు చేసింది. పోలీసు కానిస్టేబుల్ అరుణన్ వద్ద విచారణ జరిపేందుకు పోలీసులు సమన్లు పంపనున్నారు. అతను మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు రుజువయితే అరెస్టు చేసేందుకు పోలీసులు నిర్ణయించారు.