కరీంనగర్‌లో పోలీసుల కార్డన్‌ సెర్చ్ | Police Cardon search in Karimnagar | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో పోలీసుల కార్డన్‌ సెర్చ్

Oct 25 2016 8:03 AM | Updated on Sep 4 2017 6:17 PM

కరీంనగర్‌లో పోలీసుల కార్డన్‌ సెర్చ్

కరీంనగర్‌లో పోలీసుల కార్డన్‌ సెర్చ్

కరీంనగర్ జిల్లా కేంద్రంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్ చేపట్టారు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్ చేపట్టారు. మంగళవారం వేకువజామున నుంచి 7.30 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. సీపీ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో 50 మంది పోలీసులు జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఇల్లిల్లూ సోదా జరిపారు.

ఈ సందర్భంగా 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని 20 బైకులు, 2 కార్లు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా క్వింటాలు సీజ్ చేశారు. సోదాల్లో ఏసీపీ రామారావు, సీఐలు హరిప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి, సదానందం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement