కాంగ్రెస్ నాయకులు మళ్లీ వీరంగం సృష్టించారు. తిరువట్టారులో నామ్ తమిళర్ కట్చి నాయకులపై ప్రతాపం చూపించారు.
కాంగ్రెస్ నాయకులు మళ్లీ వీరంగం సృష్టించారు. తిరువట్టారులో నామ్ తమిళర్ కట్చి నాయకులపై ప్రతాపం చూపించారు. బహిరంగ సభ వేదిక, ఏర్పాట్లను ధ్వంసం చేశారు. నిప్పు పెట్టారు. నామ్ తమిళర్ కట్చి ఫిర్యాదుతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సహా 200 మందిపై కేసులు నమోదయ్యాయి.
చెన్నై: గత వారం కాంగ్రెస్, నామ్ తమిళర్ కట్చి(ఎన్‌టీకే), మరి కొన్ని తమిళ సంఘాల మధ్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. తమ కార్యాలయం ముట్టడికి యత్నించిన తమిళ సంఘాలను, నామ్ తమిళర్ కట్చి నాయకుల్ని చెన్నైలో కాంగ్రెస్ నాయకులు చితక బాదారు. ఈ వివాదం రెండు రోజుల పాటు ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ కార్యాలయం సత్యమూర్తి భవన్‌పై దాడికి దిగడం, రాజీవ్ విగ్రహాలు ధ్వంసం కావడం, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ఇళ్లు, కార్యాలయాలపై దాడి జరగడం వంటి ఘటనలు నగరంలో శాంతి భద్రతలకు విఘాతంల్గించారుు. ]
ఎట్టకేలకు పోలీసులు కొరడా ఝుళిపించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే, ఇదే తరహా వివాదం ఆదివారం కన్యాకుమారి జిల్లా తిరువట్టారులో చోటు చేసుకోవడంతో నామ్ తమిళర్ కట్చి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
వీరంగం: నామ్ తమిళర్ కట్చి నేతృత్వంలో కన్యాకుమారి జిల్లా తిరువట్టారు సమీపంలోని పోరూర్‌లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఇందుకు పోలీసు లు అనుమతి సైతం ఇచ్చారు.అయితే, ఈ సభకు కూత వేటుదూరంలో తమ పార్టీ సభకు కాంగ్రెస్ నాయకులు అనుమతి కోరగా, పోలీసులు నిరాకరించారు. ఆది వారం సభ నిర్వహణకు నామ్ తమిళర్ కట్చి ఏర్పాట్లు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ వర్గాలు వీరంగం సృష్టించాయి. తమకు మాత్రం అనుమతి ఇవ్వకుండా, వారికి మాత్రం ఎలా ఇస్తారంటూ రెచ్చి పోయారు. ముందుగా అనుమతిని నామ్ తమిళర్ కట్చి కోరడం వల్లే వాళ్లకు అనుమతి ఇచ్చామంటూ పోలీసులు పేర్కొన్నా, కాంగ్రెస్ వర్గాలు ఖాతరు చేయలేదు. శనివారం రాత్రి తమ ప్రతాపాన్ని చూపించారు.
ధ్వంసం : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రిన్స్, జాన్ జాకబ్ నేతృత్వంలో వందలాది మంది ఆ పార్టీ కార్యకర్తలు పోరూర్ పరిసరాల్లో వీరంగం సృష్టించారు. నామ్ తమిళర్ కట్చి బ్యానర్లు, ఫెక్సీలను ధ్వంసం చేశారు. సభా వేదికను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ వర్గాలను అడ్డుకునేందుకు అక్కడ నామ్ తమిళర్ కట్చి నాయకులెవ్వరు లేరు. కాంగ్రెస్ వీరంగానికి పనివాళ్లు ఉడాయించారు. సమాచారం అందుకున్న నామ్ తమిళర్ కట్చి నాయకుడు జాన్ సిలిన్ నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. కాంగ్రెస్ కార్యాలయాలపై దాడు లు చేయూలని నిర్ణయించినా, పోలీసుల జోక్యంతో వెనక్కు తగ్గారు. ఆ బహిరంగ సభ వాయిదా పడింది. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను విన్నవించారు.
జాన్ సిలిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేలు ప్రిన్స్, జాన్ జాకబ్‌తో పాటుగా 200 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి, న్యాయం చేస్తామంటూ నామ్ తమిళర్ కట్చి వర్గాలకు పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో నామ్ తమిళర్ కట్చి వర్గాలు సంయమనంతో వ్యవహరిస్తున్నారుు. తమ వాళ్లను అరెస్టు చేస్తే, తీవ్ర పరిణామాలు తప్పదంటూ కాంగ్రెస్ వర్గాలు హెచ్చరించడంతో ఈ వివాదం ఉద్రిక్తతకు దారి తీయొచ్చన్న ఆందోళన నెలకొంది.