ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి రమణ సూచిం చారు. తిరువళ్లూరు జిల్లా పూండిలో ఉచిత వైద్యశిబిరం,
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి
Sep 22 2013 4:07 AM | Updated on Sep 1 2017 10:55 PM
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి రమణ సూచిం చారు. తిరువళ్లూరు జిల్లా పూండిలో ఉచిత వైద్యశిబిరం, నిరుపేదలకు ఆర్థిక సాయం అందజేసే కార్యక్రమం శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి యూనియన్ చైర్మన్ అమ్ము మాధవన్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి రమణ హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకే పథకాలు ప్రతిభింభించే విధంగా ఉండాలన్నారు.
నిరుపేదలకు అన్ని విధాల అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. వందశాతం మంది ప్రజలకు ఏదో రూపంలో సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని సూచించారు. తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్షపాతం లేకుండా అమలు చేస్తోందని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఇప్ప టి వరకు దాదాపు 35 లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాలను వర్తింపజేసినట్లు చెప్పారు. సంక్షేమ పథకాలను సరైన రీతిలో వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఎంపీ వేణుగోపాల్, జెడ్పీ చైర్మన్ రవిచంద్రన్, తిరువళ్లూరు కలెక్టర్ వీరరాఘవరావు, ఎమ్మెల్యే రాజా పాల్గొన్నారు.
Advertisement
Advertisement