
జార్జ్‌కు మళ్లీ అమాత్యపట్టం
డీఎస్‌పీ గణపతి ఆత్మహత్య సంఘటనతో మంత్రి పదవిని కోల్పోయిన కే.జే జార్జ్ సోమవారం మళ్లీ అమాత్య పదవిని చేపట్టారు.
బెంగళూరు: డీఎస్‌పీ గణపతి ఆత్మహత్య సంఘటనతో మంత్రి పదవిని కోల్పోయిన కే.జే జార్జ్ సోమవారం మళ్లీ అమాత్య పదవిని చేపట్టారు. ఈ కేసులో కే.జే జార్జ్ మొదటి నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే.
దర్యాప్తులో గణపతి ఆత్మహత్య విషయంలో జార్జ్ పాత్ర ఏమీ లేదని సీఐడీ క్లీన్ చీట్ ఇచ్చింది. దీంతో కే.జే జార్జ్ గతంలో నిర్వర్తించిన బెంగళూరు నగరాభివృద్ధి శాఖనే సీఎం సిద్ధరామయ్య కేటాయించారు.