మల్టీ దోపిడీ | Karnataka People Demand For Outside Food Allow In Multiplex Theatre | Sakshi
Sakshi News home page

మల్టీ దోపిడీ

Jul 16 2018 9:12 AM | Updated on Jul 16 2018 9:12 AM

Karnataka People Demand For Outside Food Allow In Multiplex Theatre - Sakshi

ఐటీ సిటీలో టాకీస్‌లు పోయాయి, మల్టీప్లెక్స్‌ స్క్రీన్లు వచ్చాయి. ఒక్కసారిసరదాగా వెళ్తే అక్కడి టికెట్లు, తిండి పదార్థాల ధరలు వింటే నిజంగానే సినిమా కనిపిస్తుంది. బిస్కెట్లు, పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్‌ వంటి సాధారణ చిరుతిళ్లను 10, 15 రెట్లు అధిక ధరలకు అమ్ముతూ ప్రేక్షకులను నిలువునా దోచుకోవడం మామూలు విషయమే. ఈ పరిస్థితుల్లో ముంబయి హైకోర్టు తీర్పు నగరవాసులకు ఆశాకిరణమైంది.

సాక్షి బెంగళూరు: మల్లీప్లెక్స్‌లో బయట ఆహారాన్ని అనుమతించరని విషయం అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్స్‌లో ఏదీ కొనాలన్నా ధరలు ఆకాశంలో ఉంటాయి. సరదాగా కుటుంబంతో కలసి సినిమా చూద్దామని వెళితే అక్కడ దొరికే చిరుతిండ్లను కొనాలంటే గుండెలు అవిసిపోతాయి. అలా అని ఇంటి నుంచో, బయట నుంచో ఆహారాన్ని తెచ్చుకుంటే లోపలికి అనుమతించరు.. దీంతో చేసేదేమీ అయిష్టంగానే అంతంత ధరలను భరించి మల్టీప్లెక్స్‌లోనే ఆహారాన్ని సినీ ప్రియులు కొంటుంటారు. అయితే ఇటీవల ముంబైలోని మల్టీప్లెక్స్‌లో బయట తిండి, కూల్‌డ్రింక్స్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.

ముంబయి హైకోర్టు ఏం చెబుతోంది
ముంబయి హైకోర్టు ఆదేశాలనుసారం మహారాష్ట్ర ప్రభుత్వం మల్టీప్లెక్స్‌ థియేటర్లలోకి ప్రేక్షకులు బయటి నుంచి ఆహారాన్ని తీసుకెళ్లేలా నిబంధనలను సవరించింది. దీనివల్ల ప్రేక్షకులకు వేలాది రూపాయలు ఆదా కానున్నాయి. అలాంటి నిబంధనలేవీ బెంగళూరులని మల్టీప్లెక్స్‌లో లేనందువల్ల సినిమాలు చూసేందుకు వెళ్లే సినీప్రియులు అక్కడ లభించే ఖరీదైన స్నాక్స్‌ను కొనాల్సిన

పరిస్థితిలో ఉన్నారు. అయితే అక్కడి ధరలు వింటే ఎవరైనా హడలిపోతారు. నలుగురితో కూడిన కుటుంబం వెళ్తే స్నాక్స్‌కు కనీసం రూ.3 వేలు చెల్లించుకోవాల్సిందే.  
కాఫీ– రూ. 120, పాప్‌కార్న్‌ రూ.270
బెంగళూరులోని ఏదైనా ఒక హోటల్‌లో కాఫీ ధర రూ. 10 నుంచి రూ. 20 వరకు ఉంటోంది. కానీ మల్టీప్లెక్స్‌లో ఓ కప్పు కాఫీ ధర రూ. 120 చెల్లిస్తే కానీ దొరకడం లేదు.
మల్లీప్లెక్స్‌లో మినీ పాప్‌కార్న్‌ కనీస ధర రూ. 270.
ఇక మీడియం సైజు పాప్‌ కార్న్‌ ధర రూ. 360 కాగా, బకెట్‌ పాప్‌కార్న్‌ రూ. 470గా ఉంది.
కూల్‌డ్రింక్స్‌ ధరలు వింటే అంతే. 900 మిల్లీలీటర్‌ కలిగిన కూల్‌డ్రింక్‌ ధర రూ. 170 కాగా, 650 మిల్లీలీటర్ల శీతల పానీయం ధర రూ. 160గా ఉంది. బయట షాపులో ఇవి రూ.80 లోపే లభిస్తాయి.
100 గ్రా ఫ్రెంచ్‌ ప్రైస్‌ను ఆన్‌లైన్‌లో రూ. 100–రూ. 120 మధ్య లభిస్తుంటే అదే మల్టీప్లెక్స్‌లో దాని ధర రూ. 160ను ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.
అర్ధలీటర్‌ బిస్లరీ మినరల్‌ వాటర్‌ బాటిల్‌ ధర కేవలం రూ. 10. లీటరు ధర రూ. 19, రెండు లీటర్ల ధర రూ. 28. మల్టీప్లెక్స్‌లో హాఫ్‌ లీటర్‌ వాటర్‌ బాటిల్‌కు రూ. 40– 60 చెల్లించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement