పట్టుబడ్డ మెహ్దీ | isi passionate operations | Sakshi
Sakshi News home page

పట్టుబడ్డ మెహ్దీ

Dec 14 2014 1:26 AM | Updated on Sep 2 2017 6:07 PM

పట్టుబడ్డ మెహ్దీ

పట్టుబడ్డ మెహ్దీ

సామాజిక అనుసంధాన వేదికల (సోషియల్ నెట్‌వర్క్‌ంగ్ వెబ్‌సైట్స్) ద్వారా యువతను ఉగ్ర వాద కార్యకలాపాల వైపు ...

ఐఎస్‌ఐఎస్ కార్యకలాపాలపై మక్కువ
ఐటీసీ ఫుడ్స్‌లో ఎగ్జిక్యూటివ్‌గా ఏడాదికి రూ. 5.3 లక్షల వేతనం
వివరాలు వెల్లడించిన డీజీపీ లాల్ రుకుమ్ పచావో


బెంగళూరు : సామాజిక అనుసంధాన వేదికల (సోషియల్ నెట్‌వర్క్‌ంగ్ వెబ్‌సైట్స్) ద్వారా యువతను ఉగ్ర వాద కార్యకలాపాల వైపు ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్న యువకుడిని శనివారం తెల్లవారుజామున బెంగళూరులోని జాలహళ్లి ప్రాంతంలో అరెస్టు చేశారు. వివరాలను నగర కమిషనర్ ఎం.ఎన్ రెడ్డితో కలిసి రాష్ట్ర డీజపీ లాల్ రుకుమ్ పచావో శనివారమిక్కడ మీడియాకు వెళ్లడించారు. పశ్చిమ బెంగాల్‌లోని గోపాల్‌పురకు  చెందిన మెహ్దీ మస్‌రూర్ బిశ్వాస్(24) అక్కడి గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. మెహ్దీ తండ్రి ఇంధనశాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. మొదటి నుంచి ఇస్లామిక్ సిద్ధాంతాల పట్ల విపరీతంగా స్పందించే మెహ్దీ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా తన మనోభావాలను వెళ్లడించేవాడు.

2012లో బెంగళూరుకు చేరుకున్న మెహ్దీ ఐటీసీ ఫుడ్స్‌లో ఎగ్జిక్యూటివ్ మేనేజర్‌గా ఏడాదికి రూ.5.3 లక్షల వేతనాన్ని ఆర్జిస్తున్నాడు. పగలంతా  కంపెనీలో ఉద్యోగం చేసి రాత్రి సమయాల్లో ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) సంస్థతోపాటు,  సిరియా, లిబియా తదితర దేశాల్లో (ఎలెవన్ రీజియన్ కంట్రీస్) జరుగుతున్న రాజకీయ, సామాజిక, మత సంబంధ విషయాల పై ఎక్కువ ఆసక్తి చూపేవాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకోసం ఇంటర్‌నెట్‌పై ఎక్కువగా ఆధారపడేవాడు. ప్రముఖ సర్చ్‌ఇంజన్‌లలో సమాచారం సేకరించి అందుకు తన భావాలను చేర్చి ‘షమీ విట్నెస్’ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెళ్లడించేవాడు. అంతేకాకుండా ఉగ్రవాద కార్యకలాపాలపై టర్కీ, అరబిక్ తదితర భాషల్లో ఉన్న సమాచారాన్ని ఇంగ్లీషుకు అనువాదం చేసేవాడు. ఇతని ట్విట్టర్‌కు నెలకు దాదాపు 20 లక్షల మంది వీక్షకులు ఉండగా అందులో 17 వేల మందికి పైగా ఫాలోయర్స్‌ని తెలిపారు. వీరిలో ఎక్కువ భాగం బ్రిటన్‌కు చెందినవారేనని ఇప్పటి వరకూ జరిగిన దర్యాప్తులో తేలింది. ఇతని కార్యకలాపాలు ఎక్కువగా ఇంటర్‌నెట్ పై సాగుతుండటంతో అందుకు అనుగుణంగా నెలకు 60 జీబీ సామర్థ్యం కలిగిన డాటా కార్డును వినియోగించేవాడు.  ప్రస్తుతం మహ్దీ పై బెంగళూరులోని గంగమ్మగుడి పోలీస్‌స్టేషనల్లో  ఐపీసీ 125, 18, 39తోపాటు ఐటీ యాక్ట్ -2000 సెక్షన్ (66) (సైబర్ టైజం) ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు.

ఎవరికీ అనుమానం రాకుండా...

ఏడాదిన్నరగా బెంగళూరులోని జాలహళ్లి ప్రాంతంలోని అయ్యప్ప నగర్‌లో ఓ రెండంతస్తుల భవనంలో ఒంటరిగా ఉంటున్న మెహ్దీ ఉదయం పూట విధులకు వెళ్లి రాత్రికి తిరిగి తన గదికి చేరుకునేవాడు. అప్పుడప్పుడు ఇతని ఇంటికి సొంతూరులో ఉంటున్న తల్లిదండ్రులు వచ్చివెళ్లేవారు. చుట్టు పక్కల వారితో మామూలుగా ప్రవర్తించేవాడు.
 
ఇలా చిక్కాడు...
 

విశ్వసనీయ సమాచారం మేరకు ట్విట్టర్ అకౌంట్ కోసం తనకు సంబంధించిన (పేరు, ఈ మెయిల్ తదితర) అసలు సమాచారాన్ని ఎక్కడా వాడలేదు. అయితే ‘షమీ విట్నెస్’ ట్విట్టర్‌ను నిర్వహిస్తున్న వ్యక్తే ఎ ఎల్ సాల్టడోర్ పేరుతో మరో ట్విట్టర్‌ను నిర్వహించేవాడు. ఈ ట్విట్టర్ జీ మెయిల్‌కు అనుసంధానం అయి ఉండేది. ఇదే మెయిల్ ఐడీకు గూగుల్ ప్లస్, పేస్‌బుక్ అకౌంట్‌తో సంబంధాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా మెహ్దీ తన స్మార్ట్ ఫోన్ నుంచి షమీ విట్నెస్ ద్వారా ట్విట్లను నిర్వహించేవాడు. మరోవైపు బ్రిటన్‌కు చెందిన ఛానల్ 4 కూడా మెహ్దీ పై ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ విషయాలన్నీ  గమనించిన పోలీసులు పక్కా సమాచారం మేరకు మెహ్దీ ఉంటున్న గది పై దాడి చేసి అరెస్టుచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement