భార్య వేధింపులు తాళలేక... | Husband Commits Suicide Due To Wife Harassment | Sakshi
Sakshi News home page

భార్య వేధింపులు తాళలేక...

Aug 12 2016 4:38 PM | Updated on Sep 4 2017 9:00 AM

భార్య వేధింపులు తాళలేక...

భార్య వేధింపులు తాళలేక...

భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం కర్ణాటకలోని కుణిగల్‌ తాలూకాలో జరిగింది.

తుమకూరు: భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం కర్ణాటకలోని కుణిగల్‌ తాలూకాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం... తాలూకాలోని భైరనాయకనహళ్లికి చెందిన లోకే శ్(32)కు సమీప గ్రామానికి చెందిన వరలక్ష్మితో కొద్ది రోజుల క్రితం వివాహమైంది. కొద్ది రోజులు సజావుగా కాపురం సాగినా ఆ తరువాత లోకేశ్‌ భార్య వరలక్ష్మి పల్లెలో ఉండటానికి ఆసక్తి లేకపోవడంతో కుటుంబాన్ని బెంగళూరుకు మార్చాలని భర్తతో గొడవపడేది.

ఇదే విషయమై ఇద్దరు తరచూ ఘర్షణ పడేవారు. ఇదిలా ఉంటే గురువారం మరోసారి గొడవ పడ్డారు. దీంతో లోకేశ్‌ గురువారం తన మృతికి భార్య వరలక్ష్మితో పాటు కుటుంబ సభ్యులే కారణమని డెత్‌నోట్‌ రాసి ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లోకేశ్‌ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement