భార్య ఆత్మహత్య కేసులో భర్త అరెస్ట్ | husband arrested over wife suicide case | Sakshi
Sakshi News home page

భార్య ఆత్మహత్య కేసులో భర్త అరెస్ట్

Nov 17 2016 3:18 PM | Updated on Sep 4 2017 8:22 PM

భార్య ఆత్మహత్య కేసులో పరారీలో ఉన్న ఓ డాక్టర్ ను ఎన్‌టీపీసీ పోలీసులు అరెస్ట్ చేశారు.

జ్యోతినగర్: భార్య ఆత్మహత్య కేసులో పరారీలో ఉన్న ఓ డాక్టర్ ను ఎన్‌టీపీసీ పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ ఎన్‌టీపీసీ పరిధిలోని కృష్ణానగర్‌లో నివాసముంటున్న వాణి(28), శ్యాంకుమార్‌లు భార్యాభర్తలు. శ్యాంకుమార్ ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా అదనపుకట్నం కోసం శ్యాంకుమార్, అతని కుటుంబసభ్యులు వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన వాణి ఈ నెల 7న తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాల పాలైన వాణి చికిత్సపొందుతూ 9వ తేదీన మరణించింది. అప్పటి నుంచి భర్త శ్యాంకుమార్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం అతనిని అరెస్ట్ చేసి మీడియా ఎదుట హాజరుపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement