దేశ రాజధాని ఢిల్లీలో ఓ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యాడు. షహబాద్ డైరీ ప్రాంతంలోని సమోసా చౌక్ వద్ద గత రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యాడు. షహబాద్ డైరీ ప్రాంతంలోని సమోసా చౌక్ వద్ద గత రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు ఆగంతకులు ఓ మహిళ మెడలో చైన్ దొంగలించేందుకు యత్నించగా, కానిస్టేబుల్ వారిని అడ్డుకున్నాడు. దీంతో రెచ్చిపోయిన దుండగులు కానిస్టేబుల్పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అతడిని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు ఆనంద్గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.