బూట్లలో రెండు కేజీల బంగారం | Customs seize 2 kg gold stashed in shoes of air passenger at mangalore airport | Sakshi
Sakshi News home page

బూట్లలో రెండు కేజీల బంగారం

Jun 5 2014 8:55 AM | Updated on Sep 2 2017 8:21 AM

బూట్లలో రెండు కేజీల బంగారం

బూట్లలో రెండు కేజీల బంగారం

మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు బూట్లలో తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు బూట్లలో తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేరళలోని కాసరగోడ్‌కు చెందిన ఇబ్రహీం ఖలీస్ కునిల్ మంగళవారం రాత్రి పది గంటలకు దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్‌లో వచ్చాడు. కస్టమ్స్ అధికారుల తనిఖీ సమయంలో అతని రెండు బూట్లలో కేజీ చొప్పున రెండు బంగారు కడ్డీలు బయటపడ్డాయి. వాటి విలువ రూ.54.2 లక్షలని అధికారులు అంచనా వేశారు. అనంతరం అతన్ని మంగళూరు చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ ఎంఎస్. పాటిల్ ఎదుట హాజరు పరచగా, ఈ నెల 17 వరకు జుడీషియల్ కస్టడీకి ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement