అక్టోబర్ 1 నుంచి వెలగపూడి నుంచే ఏపీ ప్రభుత్వం పాలన ప్రారంభించాలని నిర్ణయించింది.
గుంటూరు: అక్టోబర్ 1 నుంచి గుంటూరు జిల్లాలోని వెలగపూడి నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాలన ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం వెలగపూడికి కార్యాలయాల తరలింపుపై ఏపీ ప్రభుత్వం అన్ని శాఖలకు సర్క్యూలర్ జారీ చేసింది. ఈ నెల 21 నుంచి 30 లోపు వెలగపూడికి కార్యాలయాలు తరలించాలని ఆదేశించింది.
ఏపీ పాలన వ్యవహారాలకు సంబంధించి హైదరాబాద్లో సెంట్రల్ రికార్డ్ రూమ్ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా వెలగపూడికి కార్యాలయాల తరలింపును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.