breaking news
Central record room
-
వెలగపూడికి కార్యాలయాల తరలింపు ముమ్మరం
-
వెలగపూడికి కార్యాలయాల తరలింపు ముమ్మరం
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని వెలగపూడికి కార్యాలయాల తరలింపు ముమ్మరం చేశారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి గుంటూరు జిల్లాలోని వెలగపూడి నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాలన ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు జీఏడీ (సాధారణ పరిపాలన విభాగం) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆర్థికశాఖ ఫైల్ వెలగపూడికి చేరింది. ప్రభుత్వ ఫైళ్ల తరలింపు ఇదే తొలిసారి. కాగా అయిదు భవనాల్లో ప్రభుత్వ శాఖలకు విభాగాలు కేటాయిస్తూ జీవో జారీ అయింది. మొదటి భవనం గ్రౌండ్ ఫ్లోర్లో జీఏడీకి, మిగిలిన నాలుగు భవనాలు అన్ని శాఖలకు ప్రభుత్వం కేటాయించింది. కాగా ఏపీ పాలన వ్యవహారాలకు సంబంధించి హైదరాబాద్లో సెంట్రల్ రికార్డ్ రూమ్ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
కార్యాలయాల తరలింపుపై సర్క్యూలర్ జారీ!
గుంటూరు: అక్టోబర్ 1 నుంచి గుంటూరు జిల్లాలోని వెలగపూడి నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాలన ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం వెలగపూడికి కార్యాలయాల తరలింపుపై ఏపీ ప్రభుత్వం అన్ని శాఖలకు సర్క్యూలర్ జారీ చేసింది. ఈ నెల 21 నుంచి 30 లోపు వెలగపూడికి కార్యాలయాలు తరలించాలని ఆదేశించింది. ఏపీ పాలన వ్యవహారాలకు సంబంధించి హైదరాబాద్లో సెంట్రల్ రికార్డ్ రూమ్ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా వెలగపూడికి కార్యాలయాల తరలింపును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.