నగరంలోని నేతాజీనగర్‌లో కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నవీన్ (40) గురువారం ఉరేసుకొని మృతి చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
	బళ్లారి (తోరణగల్లు) : నగరంలోని నేతాజీనగర్‌లో కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నవీన్ (40) గురువారం ఉరేసుకొని మృతి చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నేతాజీనగర్‌కు చెందిన గుత్తి నవీన్ (40) కువెంపునగర్‌లో కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు
	
	స్థోమతకు మించి అప్పులు చేయడంతో  రుణదాతలు అప్పులు తీర్చాలని ఒత్తిడి చేయడంతో మనస్థాపం చెంది గురువారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని విమ్స్‌కు తరలించారు. కాగా మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
