ఢిల్లీలో రోడ్డుప్రమాదం: ప్రకాశం జిల్లా వాసుల మృతి | bus-lorry collided in delhi, prakasam district people died | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో రోడ్డుప్రమాదం: ప్రకాశం జిల్లా వాసుల మృతి

May 29 2016 7:25 AM | Updated on Sep 4 2017 1:12 AM

ఢిల్లీలో రోడ్డుప్రమాదం: ప్రకాశం జిల్లా వాసుల మృతి

ఢిల్లీలో రోడ్డుప్రమాదం: ప్రకాశం జిల్లా వాసుల మృతి

దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది.

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన యాత్రికుల్లో ఇద్దరు మృతి చెందగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆగ్రా-యమున ఎక్స్‌ప్రెస్ వేపై నిద్రమత్తులో ఉన్న టూరిస్ట్ బస్సు డ్రైవర్ ఆగి ఉన్న ట్యాంకర్ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ప్రకాశం జిల్లా అద్దంకి సమీప గ్రామాలకు చెందిన 40 మంది యాత్రికులు ఉత్తరాది యాత్రలకు బయలుదేరారు. ఢిల్లీ, ఆగ్రాతో పాటు షిర్డి దర్శించకుని స్వగ్రామాలకు చేరుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అనూహ్యంగా రోడ్డుప్రమాదం జరగడంతో యాత్రికులు అక్కడ నుంచి మరో బస్సులో స్వగ్రామాలకు చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. మృతి చెందిన ఇద్దరినీ కొటికలపూడి గ్రామానికి చెందని వారిగా గుర్తించారు. క్షతగాత్రులను కైలాష్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన ఢిల్లీ అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement