
తుమకూరు: సంప్రదాయాలు, మతాలు వేరైనా వారి ప్రేమ సుదూర తీరాలు దాటింటి. పరస్పరం ప్రేమించుకున్న అమెరికాకు చెందిన యువతి, బెంగళూరు అబ్బాయి భారతీయ సంప్రదాయాల మధ్య వివాహం చేసుకొని ఒకింటివారయ్యారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ అజయ్ అమెరికాలో చదువుకుంటున్న సమయంలో టౌరా అనే యువతి పరిచయమై ప్రేమకుదారితీసింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే భారతీయ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవడం తనకు ఇష్టమని టౌరా పేర్కొంది. దీంతో అజయ్ తండ్రి స్నేహితుడు శ్రీ కంఠ ప్రసాద్‌కు తుమకూరు జిల్లా, తోవినకెరె సమీపంలోని ఉప్పారహళ్లిలో తోట ఉండటంతో అక్కడ పచ్చని చెట్ల మధ్య వివాహానికి ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ప్రకృతి ఒడిలో అజయ్, టౌరా వివాహం ఘనంగా జరిగింది. అనంతరం నూతన దంపతులు గోపూజ చేశారు.