పార్వతీపురం ఐటీడీఏ వద్ద ఉద్రిక్తత | all party dharna at ITDA parvathipuram | Sakshi
Sakshi News home page

పార్వతీపురం ఐటీడీఏ వద్ద ఉద్రిక్తత

Oct 24 2016 3:04 PM | Updated on Sep 4 2017 6:11 PM

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.

విజయనగరం: విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బడిదేవరకొండ, బోడి కొండలో గ్రానైట్ తవ్వకాలు నిలిపేయాలంటూ సోమవారం వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏలో కలెక్టర్ గ్రీవన్ సెల్ నిర్వహిస్తున్నారు. గ్రీవెన్ సెల్ నుంచి కలెక్టర్ ను బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వామపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement