ఎయిడ్స్ నిరోధక చర్యలు భేష్ | AIDS prevention activities are good one | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్ నిరోధక చర్యలు భేష్

Dec 2 2013 11:20 PM | Updated on Apr 4 2019 3:25 PM

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా రాయబారి నాన్సీ జె.పావెల్ పట్టణంలోని ఇందిరాగాంధీ స్మారక ఆస్పత్రిని సోమవారం సందర్శించారు

భివండీ: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా రాయబారి నాన్సీ జె.పావెల్ పట్టణంలోని ఇందిరాగాంధీ స్మారక ఆస్పత్రిని సోమవారం సందర్శించారు. ఈ విషయాన్ని సం బంధిత అధికారి ఒకరు వెల్లడించారు. హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాధి నిరోధానికి సదరు ఆస్పత్రి యాజమాన్యం తీసుకున్న చర్యల వివరాలను ఈ సందర్భంగా ఆమె తెలుసుకున్నారు. కాగా హెచ్‌ఐవీ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హెచ్‌ఐవీ-ఎయిడ్స్ పార్ట్‌నర్‌షిప్, ఇంపాక్ట్ త్రూ ప్రివెన్షన్ వంటి అనేక ప్రాజెక్టులకు అమెరికా ప్రభుత్వం మద్దతు పలుకుతోంది. ఈ కార్యక్రమాలను  పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంస్థ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ సందర్భంగా పావెల్ మాట్లాడుతూ హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాధి నిరోధానికి అసాధారణ రీతిలో చేపడుతున్న చర్యలను స్వయంగా గమనించగలగడం ఎంతో ఆనందం కలిగిస్తోంది. ఈ మహమ్మారి వ్యాధి వ్యాప్తి చెందకుండా చేసేందుకు మహారాష్ర్ట ప్రభుత్వ భాగస్వామ్యంతో కలసి పనిచేస్తున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది’ అని అన్నారు.

 

 ప్రపంచమంతా ఎదుర్కొం టున్న ఈ సవాలును అధిగమించేందుకు సంయుక్తంగా చేస్తున్న అనేక ప్రయత్నాలు ఉమ్మడి భాగస్వామ్యానికి గొప్ప ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు. అమెరికా, భారత్ దేశాలు చేయీచేయీ కలిపి ఎయిడ్స్ వ్యాధి గుర్తించడమే కాకుండా వ్యాప్తిని నియత్రించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయన్నారు. కాగా ప్రెసిడెంట్స్ ఎమర్జెన్సీ ప్లాన్ ఫర్ ఎయిడ్స్ రిలీఫ్ పథకం కింద అమెరికా ప్రభుత్వం భారత్‌లో హెచ్‌ఐవీ వ్యాప్తిచెందకుండా పెట్టుబడులు పెడుతోంది. ఇందులోభాగంగా ప్రయోగశాలలను అత్యాధునికంగా తీర్చిదిద్దడం, కీలక సమాచార వ్యవస్థల ఏర్పాటు, వ్యాధి నివారణ, చికిత్స, మానవ వనరుల అభివృద్ధి, అంతర్జాతీయంగా ఉత్తమ సేవల బదిలీ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

 

 బాధాకరం

 ఐదేళ్లలోపే చిన్నారులు చనిపోతుండడంపై పావెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చే శారు. ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో ముఖ్యంగా ప్రతి చిన్నారి తప్పనిసరిగా తన ఐదో ఏడాది పుట్టినరోజు జరుపుకునేవిధంగా చేయాలన్నారు. ప్రపంచంలో ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరు భారతదేశానికి చెందినవారేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement