గోడ కూలి ఇద్దరి మృతి | 2 killed in wall collapsed at west godavari district | Sakshi
Sakshi News home page

గోడ కూలి ఇద్దరి మృతి

Oct 22 2016 11:34 AM | Updated on Sep 4 2017 6:00 PM

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గోడ కూలిపడి ఇద్దరు మృతిచెందారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాత ఇంటిని ఐదుగురు వ్యక్తులు కలసి కూల్చుతున్నారు. అయితే, గోడ అకస్మాత్తుగా కూలిపడటంతో ఇద్దరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఒకరు అక్కడికక్కడే చనిపోగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతులను గ్రామానికి చెందిన కండెల్లి రాముడు(55), గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి(45)గా గుర్తించారు. వారి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement