జాతీయ ఆరోగ్యమిషన్(ఎన్‌హెచ్‌ఎం)నిధులతో ఏపీలో మరో 14 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
ఏపీలో కొత్తగా 14 పీహెచ్‌సీలు
Sep 26 2016 3:24 PM | Updated on Aug 18 2018 5:57 PM
హైదరాబాద్: జాతీయ ఆరోగ్యమిషన్ (ఎన్‌హెచ్‌ఎం) నిధులతో ఏపీలో మరో 14 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రజారోగ్యశాఖ పరిపాలనా అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఇందులో దొడ్డిపట్ల, అత్తిలి (పశ్చిమగోదావరి), కరప (తూర్పు గోదావరి), తాడిమర్రి, నార్పల, ముదిగుబ్బ (అనంతపురం), ముదినేపల్లి, రుద్రపాక, కల్లేటికోట, ఇందుపల్లి (కృష్ణా), అమృతలూరు, మాచవరం (గుంటూరు), గర్బామ్ (విజయనగరం), కురుచేడు (ప్రకాశం) జిల్లాలు ఉన్నాయి. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ.1.18 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ప్రస్తుతం రాష్ట్రంలో 1075 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. కొత్తగా రానున్న 14 పీహెచ్‌సీలతో ఈ సంఖ్య 1089 కి చేరనుంది. ఈ పీహెచ్‌సీలకు పూర్తిస్థాయిలో కేంద్రం నుంచే నిధులు రానున్నాయి.
Advertisement
Advertisement