డేర్‌డెవిల్స్ కెప్టెన్‌గా జహీర్ | Zaheer Khan to captain Daredevils in IPL 2016 | Sakshi
Sakshi News home page

డేర్‌డెవిల్స్ కెప్టెన్‌గా జహీర్

Mar 29 2016 12:20 AM | Updated on Sep 3 2017 8:44 PM

డేర్‌డెవిల్స్ కెప్టెన్‌గా జహీర్

డేర్‌డెవిల్స్ కెప్టెన్‌గా జహీర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొమ్మిదో సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు పేసర్ జహీర్ ఖాన్ కెప్టెన్‌గా .....

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొమ్మిదో సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు పేసర్ జహీర్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఢిల్లీ తరఫున జహీర్‌కు ఇది రెండో సీజన్ కాగా.. గత సీజన్‌లో డుమిని కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ కొత్త బాధ్యతలపట్ల జహీర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను.

కచ్చితంగా ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లతో మంచి ఫలితాలను సాధిస్తాను. తమ శక్తిసామర్థ్యాల మేరకు అందరూ ఆడితే నిలకడైన ఫలితాలు వస్తాయి’ అని జహీర్ అన్నాడు. మరోవైపు టీమ్ మెంటార్ రాహుల్ ద్రవిడ్ కూడా జహీర్ నియామకాన్ని హర్షించారు. చాలాకాలంగా జహీర్ సమర్థవంతమైన నాయకుడిగా కొనసాగుతున్నాడని, భారత క్రికెట్‌ను అనుసరించేవారికి జహీర్ ప్రభావమేమిటో తెలుస్తుందని గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement