యూకీ X ముర్రే | Yuki Bhambri up against Andy Murray in Australian Open 1st round | Sakshi
Sakshi News home page

యూకీ X ముర్రే

Jan 18 2015 1:58 AM | Updated on Sep 2 2017 7:49 PM

యూకీ X ముర్రే

యూకీ X ముర్రే

కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ సింగిల్స్ విభాగంలో అర్హత సాధించిన భారత టెన్నిస్ యువతార యూకీ బాంబ్రీకి అత్యంత కఠినమైన ప్రత్యర్థి ఎదురయ్యాడు.

ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ
మెల్‌బోర్న్: కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ సింగిల్స్ విభాగంలో అర్హత సాధించిన భారత టెన్నిస్ యువతార యూకీ బాంబ్రీకి అత్యంత కఠినమైన ప్రత్యర్థి ఎదురయ్యాడు. సోమవారం మొదలయ్యే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ ఢిల్లీ ప్లేయర్ తొలి రౌండ్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆండీ ముర్రే (బ్రిటన్)తో తలపడనున్నాడు. క్వాలిఫయింగ్ పోటీల ద్వారా 22 ఏళ్ల యూకీ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు.

శనివారం జరి గిన క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్‌లో యూకీ 6-3, 6-4తో చేజ్ బుకానన్ (అమెరికా)పై గెలిచాడు. గతేడాది డబుల్స్ విభాగంలో పోటీపడిన యూకీ మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. సింగిల్స్ విభాగంలో ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడటం యూకీకిదే ప్రథమం. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 314వ స్థానంలో ఉన్న యూకీ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందినందుకు 16 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 8 లక్షల 10 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 25 ర్యాంకింగ్ పాయింట్లు లభిం చాయి. యూకీ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లోనే ఓడిపోతే 34,500 డాలర్ల (రూ. 17 లక్షల 48 వేలు) ప్రైజ్‌మనీ, 10 ర్యాంకింగ్ పాయింట్లు లభిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement