ధావన్‌ వీడియోపై స్పందించిన మోదీ | World Cup 2019 Narendra Modi Wishes Dhawan Speed Recovery | Sakshi
Sakshi News home page

ధావన్‌ ఔట్‌.. మోదీ ట్వీట్‌

Jun 20 2019 7:46 PM | Updated on Jun 20 2019 8:05 PM

World Cup 2019 Narendra Modi Wishes Dhawan Speed Recovery - Sakshi

హైదరాబాద్‌: ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ టోర్నీ నుంచి టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ గాయం కారణంగా నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఐసీసీ టోర్నీలంటేనే రెచ్చిపోయే గబ్బర్‌ దూరమవడం అందరినీ నిరుత్సాహానికి గురిచేసింది. అయితే ప్రపంచకప్‌కు దూరం కావడంపై ధావన్‌ ఉద్వేగానికి లోనైన విషయం తెలిసిందే. దేశం తరుపున ప్రపంచకప్‌లో తన వంతు పాత్ర పోషించాలనుకున్నానని, అయితే గాయం నిరాశపరిచిందని ఎమోషనల్‌ అవుతూ ఓ వీడియోనే తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేశాడు. అయితే ఈ వీడియోపై స్పందించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ రీట్వీట్‌ చేశారు. 

‘డియర్‌ శిఖర్‌ ధావన్‌. క్రికెట్‌ పిచ్‌ నిన్ను మిస్‌ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ నువ్వు త్వరగా కోలుకొని మైదానంలోకి అడుగుపెట్టి.. దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాలని ఆకాంక్షిస్తున్నా’అంటూ మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌ కూడా ధావన్‌ ప్రపంచకప్‌ టోర్నీ నుంచి దూరంకావడంపై ఎమోషనల్‌ అయ్యాడు. గాయం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడు. అలాగే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పంత్‌కు సూచించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement