ఒక కాజ్‌ కోసం న్యూడ్‌ ఫొటోషూట్‌!

Why hockey players in Australia are going nude - Sakshi

పెర్త్‌: సమాజంలో వివక్ష ఎదుర్కొంటున్న ఎల్జీబీటీ కమ్యూనిటీకి అండగా నిలబడాలని పెర్త్‌ హాకీ ఆటగాళ్లు నిర్ణయించారు. ఇందుకోసం వాళ్లు ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ఊహించనిరీతిలో ఒంటిపై దుస్తులు విడిచి.. నగ్నంగా క్యాలెండర్ల ఫొటోషూట్‌లో పాల్గొన్నారు.

సమాజంలో స్వలింగ సంపర్కులపై ఎంతో వివక్ష నెలకొందని, వారు ఎన్నో రకాలుగా దూషణలు ఎదుర్కొంటున్నారని, దీనికి వ్యతిరేకంగా తాము నిలబడాలని నిర్ణయించామని ద పెర్త్ పైథాన్‌ హాకీ జట్టు ఆటగాడు రీడ్‌ స్మిత్‌ తెలిపాడు. పెర్త్‌ పైథాన్‌ పురుష జట్టుతోపాటు ఆస్ట్రేలియా జాతీయ జట్టు ప్లేయర్స్‌ సైతం ఈ నగ్న ఫొటోషూట్‌లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. హాకీని దేశవ్యాప్తంగా ప్రమోట్‌ చేయడంతోపాటు హోమోఫొబియోకు వ్యతిరేకంగా నిలబడేందుకు తాము ఫొటోషూట్‌లో పాల్గొన్నామని పెర్త్‌ పైథాన్‌ జట్టు ఆటగాళ్లు పేర్కొంటున్నారు. ఈ నెల 23న హాకీ ఆటగాళ్ల నగ్న క్యాలెండర్‌ను విడుదల చేయనున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top