విండీస్‌కు ఆధిక్యం | West Indies first innings lead | Sakshi
Sakshi News home page

విండీస్‌కు ఆధిక్యం

Feb 3 2019 3:59 AM | Updated on Feb 3 2019 3:59 AM

West Indies first innings lead - Sakshi

నార్త్‌సౌండ్‌: మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ డారెన్‌ బ్రేవో (216 బంతుల్లో 50; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అపరిమిత సహనంతో నిలిచి ఇంగ్లండ్‌తో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్‌కు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం అందించాడు. అతడికి... డౌరిచ్‌ (31), కెప్టెన్‌ హోల్డర్‌ (22) సహకరించడంతో మూడో రోజు లంచ్‌కు ముందు విండీస్‌ 306 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు బ్రాత్‌వైట్‌ (49), కాంప్‌బెల్‌ (47),   షైహోప్‌ (44) రాణించారు. దీంతో ఆతిథ్య జట్టుకు 119 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ కడపటి వార్తలు అందేసరికి 3 వికెట్లు నష్టపోయి 59 పరుగులు చేసింది. మరో 60 పరుగులు వెనుకబడి ఉంది. శనివారం తల్లి చనిపోయిన బాధను దిగమింగి విండీస్‌ పేసర్‌ అల్జారీ జోసెఫ్‌ బ్యాటింగ్‌కు దిగడం అందరినీ కదిలించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement