బెంగళూరు వీక్‌నెస్‌పై దెబ్బకొడతాం! | We Attack On RCB Batsmen Weakness, Says Krishnappa Gowtham | Sakshi
Sakshi News home page

బెంగళూరు వీక్‌నెస్‌పై దెబ్బకొడతాం!

Apr 15 2018 1:32 PM | Updated on Apr 15 2018 1:32 PM

We Attack On RCB Batsmen Weakness, Says Krishnappa Gowtham - Sakshi

క్రిష్ణప్ప గౌతమ్‌

సాక్షి, బెంగళూరు : రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు బలహీనతపై దెబ్బకొడతామని స్పిన్నర్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు క్రిష్ణప్ప గౌతమ్‌ అన్నాడు. బెంగళూరు టాప్ బ్యాట్స్‌మెన్ స్పిన్నర్లను అంత ధీటుగా ఎదుర్కోలేరని ఆ ఆఫ్‌బ్రేక్ బౌలర్ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం సొంతగడ్డ బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో వారు ఆడిన విధానాన్ని బట్టి ఓ అంచనాకు వచ్చినట్లు తెలిపాడు. చిన్నస్వామి స్టేడియంలో 200 పరుగులు ఈజీగా చేయవచ్చునని, ఐతే స్పిన్నర్లు తలుచుకుంటే అడ్డుకోవడం సాధ్యమన్నాడు.

స్పిన్నర్లకు ఇక్కడ అనుకూల వాతావరణ ఉంది. బెంగళూరుకు ఆదిలోనే స్పిన్‌ బౌలింగ్‌తో దెబ్బతీస్తాం. తొలి పది ఓవర్లలోనే స్పిన్‌ బౌలింగ్ వేస్తే వారు 80, 90 పరుగులు చేసేలోపే 4 వికెట్లు కోల్పోయవడం ఖాయంగా కనిపిస్తోంది. నేటి మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశాలు లేకపోలేదు. రాజస్తాన్‌ ఆటగాడిగా ఐపీఎల్ ప్రారంభించిన స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్ ఆపై కోచ్‌గా, మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆయన కోచింగ్‌తో  రాజస్తాన్ ఎప్పుడూ బౌలింగే ఆయుధంగా బరిలోకి దిగుతామని' స్పిన్నర్ క్రిష్ణప్ప గౌతమ్‌ వివరించాడు. 

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో నేటి సాయంత్రం 4 గంటలకు రాజస్తాన్‌, బెంగళూరుల మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement