
కోహ్లికి అంకితభావం ఎక్కువ: రవిశాస్త్రి
ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శనకు అతడి ప్రియురాలు అనుష్క శర్మ కారణం కాదని టీమిండియా డెరైక్టర్ రవిశాస్త్రి స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శనకు అతడి ప్రియురాలు అనుష్క శర్మ కారణం కాదని టీమిండియా డెరైక్టర్ రవిశాస్త్రి స్పష్టం చేశారు. అవన్నీ మతిలేని ఆరోపణలని కొట్టిపారేశారు. ‘ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లి నాలుగు సెంచరీలతో పాటు 700 పరుగులు సాధించాడు. నేను చూసిన ఆటగాళ్లలో ఇతనికే అంకితభావం ఎక్కువ. దేశం కోసం ఆడాలనే తపనతో ఉంటాడు’ అని శాస్త్రి మద్దతు పలికారు. ఇక టెస్టుల నుంచి తప్పుకున్న ధోని తన బ్యాటింగ్‌ను మరింత మెరుగుపరుచుకునేందుకు సమయం లభించిందన్నారు. సెమీస్‌లో భారత్ ఓటమికి టాస్ ఓడిపోవడం కూడా కారణమన్నారు.