బిజీ బిజీ ప్రిపరేషన్లో కోహ్లి | Virat Kohli’s session in the gym ahead of New Zealand series will give you fitness goals | Sakshi
Sakshi News home page

బిజీ బిజీ ప్రిపరేషన్లో కోహ్లి

Sep 15 2016 1:57 PM | Updated on Sep 4 2017 1:37 PM

బిజీ బిజీ ప్రిపరేషన్లో కోహ్లి

బిజీ బిజీ ప్రిపరేషన్లో కోహ్లి

త్వరలో న్యూజిలాండ్తో సిరీస్ నేపథ్యంలో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తన ఫిట్నెస్ను మరింత మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాడు.

కాన్పూర్: త్వరలో న్యూజిలాండ్తో సిరీస్ నేపథ్యంలో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తన ఫిట్నెస్ను మరింత మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాడు. తన ఫిట్నెసే సక్సెస్ మంత్రంగా భావించే కోహ్లి..  అతని ఇంటివద్ద జిమ్లో పలు రకాల కసరత్తులు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. దీనిలో భాగంగా ముందుగా 15 నిమిషాల పాటు సైక్లింగ్ చేసిన కోహ్లి.. ఆ తరువాత ఎటువంటి విశ్రాంతి తీసుకోకుండా ట్రేడ్మిల్ వ్యాయామం చేశాడు.

దాదాపు నిమిషానికి 120 రౌండ్ల పాటు సైక్లింగ్ చేసిన తరువాత ఎటువంటి విరామం తీసుకోకుండా  ట్రేడ్ మిల్ వ్యాయమం చేసినట్లు కోహ్లి స్పష్టం చేశాడు. ఈ మేరకు  ప్రతీ 20 సెకెండ్లకు 10 స్ట్రైడ్స్ చేయడమే కాకుండా,  ప్రతీ స్ట్రైడ్కు కేవలం 10 సెకెండ్ల విశ్రాంతి మాత్రమే తీసుకున్నట్లు ఈ స్టైలిష్ ఆటగాడు పేర్కొన్నాడు.

ఈ నెల 22న కాన్పూర్‌లో జరిగే మొదటి మ్యాచ్‌తో ఈ మూడు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. విరాట్‌ కోహ్లి నాయకత్వంలో స్వదేశంలో జరిగే సుదీర్ఘ క్రికెట్ సిరీస్ లో న్యూజిల్యాండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement