
జైపూర్: తమిళనాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐపీఎల్ సీజన్ 12 కోసం జరగుతున్న ఆటగాళ్ల వేలంలో సంచలనం నమోదు చేశాడు. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ ఆటగాడి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డారు. ఏకంగా రూ.8.40 కోట్ల రికార్డు ధరకు కింగ్స్ పంజాబ్ సొంతం చేసుకుంది. లిస్ట్ ఏ క్రికెట్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన ఈ యువ సంచలనం ఏకంగా 22 వికెట్లు పడగొట్టాడు.
ఇక దేశవాళీ లీగ్‌లోనూ తన దైన రీతిలో అదరగొట్టడంతో ప్రాంచైజీలు దృష్టిలో పడ్డాడు. ఇక ఇప్పటివరకూ జరిగిన వేలంలో జయదేవ్ ఉనాద్కత్(రూ. 8.40 కోట్లు-రాజస్థాన్), శివం దుబే(రూ. 5కోట్లు-ఆర్సీబీ), వరుణ్ చక్రవర్తి(రూ. 8.40 కోట్లు- కింగ్స్ పంజాబ్)లు జాక్‌పాట్ కొట్టారు. హనుమ విహారి కనీస ధర రూ. 50 లక్షలుండగా, రూ. 2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఇక కార్లోస్ బ్రాత్‌వైట్ ను రూ. రూ. 5 కోట్లకు కేకేఆర్ తీసుకోగా, హెట్‌మెయిర్‌ను రూ. 4.20 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.