ఇంగ్లండ్‌ శుభారంభం

ustin Langer squad, AJ Tye - Sakshi

లండన్‌: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొంది ఐదు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది. బుధవారం రాత్రి జరిగిన ఈ పోరులో మొదట ఆస్ట్రేలియా 47 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది. మ్యాక్స్‌వెల్‌ (62), అస్టన్‌ అగర్‌ (40) రాణించారు. ‘మ్యాన్‌ ఆఫ్‌  ద మ్యాచ్‌’ మొయిన్‌ అలీ, ప్లంకెట్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా, ఆదిల్‌ రషీద్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ 44 ఓవర్లలో 7 వికెట్లకు 218 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ మోర్గాన్‌ (69), జో రూట్‌ (50) అర్ధసెంచరీలు సాధించారు. స్టాన్‌లేక్, నెసెర్, ఆండ్రూ టై తలా 2 వికెట్లు తీశారు. కార్డిఫ్‌లో రేపు (శనివారం) రెండో వన్డే జరగనుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top