ఎదురులేని హైదరాబాద్ | Unbeatable Hyderabad team | Sakshi
Sakshi News home page

ఎదురులేని హైదరాబాద్

Feb 9 2014 12:08 AM | Updated on Apr 4 2019 4:27 PM

నగరాన్ని మరో లీగ్ ముంచెత్తింది. అమెరికన్ ఫుట్‌బాల్ (రగ్బీ)ను యువత ఆస్వాదించింది.

గచ్చిబౌలి, న్యూస్‌లైన్: నగరాన్ని మరో లీగ్ ముంచెత్తింది. అమెరికన్ ఫుట్‌బాల్ (రగ్బీ)ను యువత ఆస్వాదించింది. ఎలైట్ ఫుట్‌బాల్ లీగ్ ఆఫ్ ఇండియా లీగ్ (ఈఎఫ్‌ఎల్‌ఐ)లో భాగంగా శనివారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు నిర్వహించారు. ఇందులో హైదరాబాద్ స్కైకింగ్స్ 27-0తో ముంబై గ్లాడియేటర్స్ జట్టుపై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.
 
 ఆట ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన హైదరాబాద్ ఆటగాళ్లు ఏ దశలోనూ ప్రత్యర్థి జట్టుకు అవకాశమివ్వలేదు. దీంతో ముంబై ఒక్క పాయింట్ కూడా సాధించకుండానే ఆట ముగించాల్సి వచ్చింది. అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ డిఫెండర్స్ 21-6తో బెంగళూరు వార్‌హాక్స్‌పై ఘనవిజయం సాధించింది. నగరంలోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి వేలాది మంది విద్యార్థులు మ్యాచ్‌లు తిలకిం చేందుకు వచ్చారు. మ్యాచ్‌లు తిలకించిన వారిలో అవినీతి నిరోధక శాఖ డెరైక్టర్ జనరల్ ఎ.కె.ఖాన్ ఉన్నారు. ఈ లీగ్‌కు ‘సాక్షి’ గ్రూప్ మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది.
 
 ఆటకు ప్రాచుర్యం తెస్తాం
 అమెరికన్ ఫుట్‌బాల్ (రగ్బీ) ఆటపై ఆంధ్రప్రదేశ్‌లో ప్రాచుర్యం కల్పించాలనే లక్ష్యంతో ఈఎఫ్‌ఎల్‌ఐ లీగ్‌ను ప్రారంభించామని లీగ్ సీఈఓ రిచర్డ్ వెలిన్ పేర్కొన్నారు. హైదరాబాద్ స్కైకింగ్స్ యజమాని డాక్టర్ వెంకటేశ్ మువ్వా మాట్లాడుతూ అన్ని టీమ్‌లను ఒక చోటకు తీసుకువచ్చి  రగ్బీకి ఆదరణ పెంచేందుకు కృషి చేస్తామన్నారు. లీగ్ బ్రాండ్ అంబాసిడర్ సినీ హీరో సుమంత్ మాట్లాడుతూ మన దేశంలో క్రికెట్ మాదిరిగానే అమెరికన్ ఫుట్‌బాల్‌కూ పాపులారిటీ తెస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement