ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ నాసిరకం | Trent Bridge pitch rated 'poor' by ICC match referee | Sakshi
Sakshi News home page

ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ నాసిరకం

Jul 20 2014 1:19 AM | Updated on Sep 2 2017 10:33 AM

ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ నాసిరకం

ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ నాసిరకం

భారత్, ఇంగ్లండ్‌ల మధ్య తొలి టెస్టుకు ఆతిథ్యమిచ్చిన ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ నాసిరకమైనదని ఐసీసీ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ తేల్చారు.

 తేల్చిన మ్యాచ్ రిఫరీ బూన్
 దుబాయ్: భారత్, ఇంగ్లండ్‌ల మధ్య తొలి టెస్టుకు ఆతిథ్యమిచ్చిన ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ నాసిరకమైనదని ఐసీసీ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ తేల్చారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)పై జరిమానా విధించే అవకాశాలున్నాయి.
 
 ఐసీసీ పిచ్ నియమావళిలోని క్లాజ్-3 ప్రకారం పిచ్‌ను పరిశీలించిన బూన్.. తన నివేదికను ఐసీసీకి అందజేశారు. దీన్ని ఈసీబీకి పంపి 14 రోజుల్లో స్పందనను తెలియజేయాలని క్రికెట్ మండలి కోరింది. ఈసీబీ నివేదిక తర్వాత ఐసీసీ జనరల్ మేనేజర్ క్రికెట్ జెఫ్ అల్లార్డిక్, చీఫ్ మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలేలు మరోసారి వీడియో ఫుటేజ్‌లను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు భారత్‌కు సరిపోయే విధంగా వికెట్‌ను తయారు చేసినందుకు నాటింగ్‌హామ్ చీఫ్ గ్రౌండ్స్‌మన్ స్టీవ్ బ్రిక్స్ క్షమాపణలు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement